హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపునకు చర్యలు'

ఏలూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు DEO వెంకటలక్ష్మమ్మ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం మార్చి నుంచి ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలు, ఉచిత పుస్తకాలు, డిజిటల్ తరగతులు, ల్యాబ్‌లు, ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తామన్నారు.