GDWL: గద్వాల పట్టణానికి చెందిన 925 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేసింది. ఈ మేరకు గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఆరు గ్యారెంటీల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులకు కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
925 మందికి కొత్త పింఛన్లు మంజూరు


