హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తం కావాలి : ఎమ్మెల్యే

కృష్ణా: అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు వ్యవసాయ శాఖ సూచనలు పాటించాలని కోరారు. డ్రైనేజీ అధికారులు, నీటి సంఘాల ప్రతినిధులు సమిష్టిగా మురుగునీటి పారుదలకు ఎక్కడైనా అడ్డంకులు తొలగించాలన్నారు.