WG: భీమవరంలో CITU ఆధ్వర్యంలో 'చలో ఢిల్లీ' గోడపత్రికను మంగళవారం విడుదల చేశారు. లేబర్ కోడ్స్ రద్దు, కనీస వేతనాలు, ధరల నియంత్రణ డిమాండ్లతో డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీ రాంలీలా మైదానంలో జరగనున్న జాతీయ నిరసనలో అందరూ భాగస్వాములు కావాలని CITU జిల్లా కార్యదర్శి బి.వాసుదేవరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు ఎం.ఆంజనేయులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
భీమవరంలో చలో ఢిల్లీ గోడపత్రిక ఆవిష్కరణ


