హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సైబర్ క్రైమ్ ముఠాకు సహకరించిన వ్యక్తి అరెస్ట్

శ్రీకాకుళం జిల్లా పలాసలో సైబర్ కేటుగాడుని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.1.30 కోట్ల సైబర్ స్కాంలో విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగి కింతలి శంకరరావును హరియాణా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లికి చెందిన శంకరరావు సైబర్ ముఠాకు బ్యాంకు ఖాతాల వివరాలు అందించాడనే ఆరోపణలున్నాయి. అతడి ఖాతాలో రూ.33 లక్షలు జమ అయిన విషయం బయటపడింది.