ATP: కుడ్లూరు గ్రామంలోని పురాతన బసవేశ్వర ఆలయంలో కలశం చోరీకి గురైంది. అర్ధరాత్రి గంటకు పైగా విద్యుత్ సరఫరా నిలిపివేసి దుండగులు పక్కా ప్రణాళికతో చోరీకి పాల్పడ్డారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విజయనగర రాజుల కాలం నాటి ఈ ఆలయంలో గతంలోనూ చోరీ జరిగిందని, ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపి కలశాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ నిలిపివేసి కలశం అపహరణ!


