హైదరాబాద్: 28°C
తెలంగాణ

తుమ్మలపై దుష్ప్రచారంపై హెచ్చరిక

BDK: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేరుతో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వ్యాఖ్యలు ప్రచారం చేస్తున్నారని దమ్మపేటలో మాజీ జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని, కరువు తర్వాత ఏ ప్రభుత్వమూ గెలవలేదని తుమ్మల అన్నట్టు రాస్తున్నారని, ఆయన అలా అనలేదని చెప్పారు. ప్రచారకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.