హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

విశాఖ: ఇసుకతోట రామాలయం వీధికి చెందిన టైలర్ తెడ్లపు సత్యనారాయణ (58) సోమవారం సాయంత్రం కూరగాయల కోసం వెళ్లి అదృశ్యమయ్యారు. మంగళవారం స్థానిక ఓ షోరూమ్ వద్ద ఆయన అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. ఎంవీపీ పోలీసులు మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుని కుమారుడు శివకుమార్ ఫిర్యాదుతో మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు