హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నామినేషన్‌కు వెళ్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు'

SS: రామగిరి మండలం నసనకోట పంచాయతీ అభ్యర్థి కాంత కుమారుడిపై టీడీపీ అభ్యర్థి అనుచరులు దాడికి పాల్పడి, నామినేషన్ పత్రాలు చించివేశారని వైకాపా నేత గోరంట్ల మాధవ్ ఆరోపించారు. నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా వాహనంతో ఢీకొట్టారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. నేడు నామినేషన్‌కు వెళ్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.