హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొలి విడత పంచాయతీ నామినేషన్లు ప్రశాంతం

అనంతపురం జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాలతో నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో ప్రత్యేక నిఘా ఉంచారు. ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు సహకరించిన ప్రజలకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.