హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జగన్ ఆదేశాలతోనే దాడులు'

అన్నమయ్య జిల్లా యర్రంరెడ్డిగారిపల్లెలో టీడీపీ నాయకులపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయంటూ టీడీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి పరుచూరి అశోక్ బాబు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. జగన్ ఆదేశాలతోనే వైసీపీ నేతలు ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.