హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధాన్యం సురక్షిత ప్రాంతాలకు తరలించాలి: తహసీల్దార్

కృష్ణా: పెడన మండలం కూడూరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం తహసీల్దార్ వహీదా రెహమాన్, మండల వ్యవసాయ అధికారి సజ్జా జెన్నీ సందర్శించి కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు లేదా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, తొందరపడి పంట కోతలు చేపట్టవద్దని రైతులకు సూచించారు.