NTR: మైలవరం మండలం పుల్లూరులో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన తమ్మిశెట్టి వెంకయ్య (65) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, వెనక నుంచి రామచంద్రంపురం వైపు వెళ్తున్న మరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తమ్మిశెట్టి వెంకయ్య అక్కడికక్కడే మృతి చెందారు. మరో వాహనదారుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


