KMR: ఈ నెల 13న గందరగోళంతో వాయిదా పడిన కామారెడ్డి మున్సిపల్ సమావేశం బుధవారం తిరిగి జరగనుంది. గత సమావేశంలో 40 అంశాలు పెండింగ్లో పడ్డాయి. రూ.4.40 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం లభిస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది. గత సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఆందోళనతో ఎజెండాపై చర్చ జరగలేదు. ఈసారైనా సమావేశం సజావుగా సాగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ
రేపైనా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సజావుగా సాగేనా?


