హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీమా నమోదు శిబిరాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

ములుగు జిల్లాలో నవంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు శిబిరాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల బీమా అందేలా ఆధార్, కుటుంబ సభ్యులు, నామినీ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. డిసెంబర్ 18లోగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.