హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీజేపీ అభ్యర్థి పై చర్యలేవి: సీపీఐ

శ్రీకాకుళంలో పోలీసులను కారుతో ఢీకొట్టిన బీజేపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ డిమాండ్ చేశారు. 36వ డివిజన్ బీజేపీ అభ్యర్థి చల్లా వెంకటేశ్వరరావు నామినేషన్ కేంద్రానికి కారుతో వెళ్లి పోలీసులను ఢీకొట్టారని ఆరోపించారు. ఆయనను వెంటనే అరెస్ట్ చేసి, ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని మంగళవారం ప్రకటనలో కోరారు.