హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

GNTR: తాడేపల్లి-మంగళగిరి నగరపాలక సంస్థ ఎన్నికలకు ఈ నెల 26న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, డీఎస్పీ వెంకటేశ్వర్లు మంగళగిరిలో పర్యటించారు. పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లపై ఆరా తీశారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు.