KRNL: ఆదోని మండలం-2 పరిధిలోని బసాపురం సర్పంచ్‌గా టీడీపీ మద్దతుదారుడు కమ్మ సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల నాయకుల సహకారంతో ఏకగ్రీవ ఎన్నిక సాధ్యమైంది. ఈ సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
బసాపురం సర్పంచ్‌గా కమ్మ సత్యనారాయణ ఏకగ్రీవం


