అన్నమయ్య: రామసముద్రం మండలంలోని 19 గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు 6 స్వర్ణ గ్రామ సచివాలయాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు MPDO లతీఫ్ ఖాన్ తెలిపారు. రామసముద్రం, ఊలపాడు, కుదురుచీమనపల్లి, మలేనత్తం, పెద్దకురపల్లి, చెంబకూరు కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 21 నుంచి 23 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్లకు ఆరు స్వర్ణ గ్రామ సచివాలయాలు: MPDO


