PPM: నర్సిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను DEO పి.బ్రహ్మాజీ రావు మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి పరీక్షల సన్నద్ధతపై ఆరా తీశారు. తరగతిలో ప్రతిభ కనబరిచిన ఇద్దరు విద్యార్థులకు బహుమతులు అందజేసారు.
ఆంధ్రప్రదేశ్
జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించిన డీఈవో


