హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భూముల రీ సర్వే త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

PDPLI: కాల్వ శ్రీరాంపూర్, ముత్తారం మండలాల్లో కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం పర్యటించారు. మంగపేట, కిష్టంపేట, కేశనపల్లిలో భూ రీ సర్వేను పరిశీలించి ప్రజల భాగస్వామ్యంతో త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర, సన్నవడ్లకు రూ. 500 బోనస్ పొందాలని సూచించారు. ముత్తారంలో నూతన తహసిల్దార్ కార్యాలయ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.