హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన చేయుట పింఛన్ల మంజూరు

JGL: మల్యాల మండలoలో అర్హులైన 584 మందికి చేయూత నూతన పింఛన్లు మంజూరైనట్లు ఎంపీడీవో స్వాతి తెలిపారు. వీరిలో దివ్యాంగులు 110, వివాహమైన ఒంటరి మహిళలు 49, వివాహం కాని ఒంటరి మహిళలు 14, గీత కార్మికులు 120, వితంతువులు 291 మంది ఉన్నారు. వీరికి త్వరలో మంజూరు పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పింఛన్ అందజేస్తుందన్నారు.