హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పగిలిన పైప్‌లైన్‌.. రోడ్డుపాలవుతున్న తాగునీరు

KNR: నగరంలోని భగత్‌నగర్‌ వాటర్‌ ట్యాంక్‌ సమీపంలో ఏడాదిగా మంచినీటి పైప్‌లైన్‌ లీకై నీరంతా రోడ్డుపాలవుతోంది. ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి ముప్పు పొంచి ఉన్నా అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తక్షణమే లీకేజీని అరికట్టి నీటి వృథాను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.