హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వార్డులో అభివృద్ధి పనులపై సమాచారం ఇవ్వాలి'

NGKL: నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో 12వ వార్డు అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలుపై తనకు సమాచారం ఇవ్వకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని కౌన్సిలర్ ముమ్మడి జయలక్ష్మి ఇవాళ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష BRS కౌన్సిలర్‌ననే వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ, వార్డులో జరిగే ప్రతి కార్యక్రమంపై సమాచారం ఇవ్వాలని, తనకు తగిన గౌరవం కల్పించాలని డిమాండ్ చేశారు.