తూర్పు గోదావరి జిల్లా పై అక్వాన్ తుఫాను ప్రభావం పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతం లో తుఫాను బలపడుతూ తీరం వైపు దూసుకువస్తోంది. 12 గంటల లో తీవ్ర తుఫాను గా, నవంబర్ 19 న ఉదయానికి అతి తీవ్ర తుఫానుగా మారనుంది. జిల్లా లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'అక్వాన్ తుఫాను దూసుకువస్తోంది'


