హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సబ్ జైలు తనిఖీ చేసిన జిల్లా న్యాయమూర్తి

AKP: నర్సీపట్నం సబ్ జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ రెడ్డి సన్యాసి నాయుడు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలులో ఖైదీలకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, ఆహార పరిస్థితులను పరిశీలించారు. విచారణలో ఉన్న ఖైదీలతో మాట్లాడి వారి కేసుల వివరాలు, బెయిల్ సౌకర్యం, ఉచిత న్యాయ సహాయం తీరును అడిగి తెలుసుకున్నారు.