హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏయూను సందర్శించిన కెన్యా ప్రతినిధి బృందం

VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని కెన్యా రాయబార కార్యాలయ ప్రతినిధి బృందం మంగళవారం సందర్శించింది. పాలకమండలి సమావేశ మందిరంలో ఏయూ ఉన్నతాధికారులతో భేటీ అయ్యి విద్యా సహకారం, విద్యార్థుల సంక్షేమం, అవగాహన ఒప్పందాలపై చర్చించింది. కెన్యా విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, పూర్వ విద్యార్థుల అనుసంధానం అవసరమని ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్‌ పేర్కొన్నారు.