హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్లపై ఏఎస్పీ ప్రత్యేక నిఘా

SS: ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు.  జిల్లా ఏఎస్పీ అంకిత సురాణ మంగళవారం ముదిగుబ్బ, బత్తలపల్లి మండలాల్లో పర్యటించి పలు నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేశారు. గత రెండు రోజులుగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని పేర్కొంటూ, చివరి రోజు కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని పోలీసు సిబ్బందికి సూచించారు.