హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నామినేషన్ల పరిశీలన

E.G: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను సాధారణ పరిశీలకులు ఎం. గౌతమి మంగళవారం కడియం మండలంలోని కడియపులంక, దొమ్మేరు, మలకపల్లి, కోలమూరు గ్రామాల్లో పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నామినేషన్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. నామినేషన్ ప్రక్రియలో పాటించాల్సిన విధివిధానాలను తెలియజేశారు.