హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పందేల బరిలో బంపర్ గిఫ్ట్స్!

కృష్ణా జిల్లాలో సంక్రాంతి కోడిపందేల సందడి మొదలైంది. పండగకు ముందుగానే పెడనలో బరుల నిర్వాహకులు భారీ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. బుల్లెట్ బైకులు, కార్లు, తదితర బహుమతులతో పందేలకు సంబంధించి అగ్రిమెంట్లు రాసుకునే కార్యక్రమాన్ని పెడనలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించారు. పందెంరాయుళ్లకు విందు, సన్మానాలు సైతం ఏర్పాటు చేశారు.