E.G: రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో వైసీపీకి చెందిన మాజీ కార్పొరేటర్ మింది నాగేంద్ర తన అనుచరులతో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనతో పాటు మాజీ కార్పొరేటర్ మింది మాధవీ, డబ్బింగ్ రమేష్, హర్షవర్ధన్ స్కూల్స్ అధినేత దేశెట్టి హరిప్రసాద్ తదితరులు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలో చేరిన మాజీ కార్పొరేటర్


