PPM: సాలూరు ఘాటీపై మంగళవారం మధ్యాహ్నం ఒడిశా నుంచి వస్తున్న లారీ పీ.కొనవలస చెక్ పోస్ట్ సమీపంలో ఘాట్ రోడ్డు మలుపు వద్ద కొండను ఢీకొట్టింది. స్థానిక పోలీసులు క్రేన్ సహాయంతో లారీని తీస్తుండగా, అదే రూట్లో వస్తున్న ఆర్టీసీ బస్సును నిలిపివేశారు. ఈ క్రమంలో వేగంగా వస్తున్న మరో లారీ ఆర్టీసీ బస్సును వెనక నుంచి ఢీకొట్టడంతో బస్సులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
సాలూరు ఘాటీపై రోడ్డు ప్రమాదం


