హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మురుగునీటి కాలువల పూడిక తక్షణమే తొలగించాలి'

KKD: భారీ వర్షాల సమయంలో కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) ప్రాంగణంలో నీరు నిల్వ ఉండకుండా మురుగునీటి కాలువల్లో పేరుకుపోయిన పూడికను తక్షణమే తొలగించాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జీజీహెచ్‌లోని మురుగునీటి పారుదల వ్యవస్థ, ప్రధాన కాలువల అవుట్‌లెట్లను నగరపాలక సంస్థ కమిషనర్, ఆసుపత్రి అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.