హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికలపై కూటమి నేతలకు దిశానిర్దేశం

NDL: బనగానపల్లె పట్టణ సమీపంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో కూటమి నాయకులు ఐకమత్యంగా ఉండి సర్పంచ్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత తీసుకోవాలని మంత్రి వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.