హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంక్షేమ కళాశాలలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

NZB: ఆర్మూర్ పట్టణంలోని పిప్రి రోడ్డులో ఉన్న TG సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ బాలుర కళాశాలను ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలోని వసతులను పరిశీలించడంతో పాటు వంటగదిలో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూసి తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.