హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడీ సిబ్బందికి పింఛన్లు ఇవ్వాలని వినతి

BDK: అశ్వాపురం మండలం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు చేయూత పింఛన్లు మంజూరు చేసి ఆర్థిక భరోసా కల్పించాలని మంగళవారం ఏఐటీయూసీ నాయకులు కోరారు. ఈ మేరకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కలిసి వినతిపత్రం అందజేశారు. అర్హుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.