NRML: నియోజకవర్గానికి చెందిన 150 మంది లబ్ధిదారులకు రూ.58,34,500 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కూచాడి శ్రీహరిరావు మంగళవారం పంపిణీ చేశారు. వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ


