హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఛైర్‌పర్సన్

AKP: నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో మంగళవారం మున్సిపల్ ఛైర్‌పర్సన్ చింతకాయల పద్మావతి ఆకస్మికంగా పర్యటించారు. వివిధ వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్యం, మందుల లభ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని చెప్పారు.