హైదరాబాద్: 28°C
తెలంగాణ

హరీశ్‌రావు ఎదుట రైతుల ఆవేదన

SRD: నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీశ్‌ పరిశీలించి రైతులతో మాట్లాడారు. కరెంటు లేక పంటను కాపాడుకునేందుకు జనరేటర్ ఏర్పాటు చేసి రోజుకు రూ.10 వేల చొప్పున ఏడు రోజులకు రూ.70 వేలు ఖర్చు చేసినట్లు ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో తరుగు తీస్తుండటంతో ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం అమ్ముకుంటున్నామని రైతులు వాపోయారు.