హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

SDPT: అక్బర్‌పేట భూంపల్లి మండలంలోని తాళ్లపల్లిలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం, నామినీ నమోదు వల్ల కలిగే ప్రయోజనాలను గ్రామస్థులకు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రభాకర్, ఉపసర్పంచ్ నవీన్, టీజీబీ చిట్టాపూర్ మేనేజర్ అభినయ్ రెడ్డి, సీఏ స్వప్న, కౌన్సిలర్లు పాల్గొన్నారు.