హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ రోజుల్లో వేతనంతో కూడిన సెలవు

VSP: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల రెండో సాధారణ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి. నవంబర్ 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వ, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు వేతనంతో కూడిన స్థానిక సెలవు కల్పించాలని ప్రభుత్వం సూచించింది.