హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య

NLG: నల్లగొండ పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహంలో విషాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా మాడుగుల గ్రామానికి చెందిన గండికోట జగదీశ్ (పాలిటెక్నిక్ రెండో సంవత్సరం) హాస్టల్ గదిలో ఉరివేసుకుని మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.