హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా స్థాయి క్విజ్ పోటీల్లో నకరికల్లు విద్యార్థిని ప్రతిభ

PLD: నరసరావుపేట శంకరభారతిపురం జడ్పీ హైస్కూల్‌లో ఎన్నికల సంఘం నిర్వహించిన జిల్లా స్థాయి ఎలక్టోరల్ లిటరసీ క్విజ్‌లో నకరికల్లు ఎస్వీవీఆర్ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని కే. రిషిత శ్రీకరి ప్రథమ స్థానం సాధించింది. ఈ నెల 20న కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకోనుంది. రిషితను, గైడ్ టీచర్ ఎన్. బాజీ బాబును హెచ్ఎం జే. శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు అభినందించారు.