విజయనగరం: కూలి పనికి వెళ్తూ ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. గజపతినగరం మండలం పురిటిపెంట పంచాయతీ మామిడిబంద కాలనీకి చెందిన గెద్ద శ్రీనివాసరావు సోమవారం ఇనుప సామగ్రి లోడుతో వెళ్తున్న లగేజీ ఆటోపై కూర్చుని ఎన్జీఆర్ పురం సమీపంలో ప్రయాణిస్తూ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని భార్య ముత్యాలమ్మ ఫిర్యాదు చేయగా ఎస్సై కిరణ్కుమార్ నాయుడు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఆటోపై నుంచి జారీపడి వ్యక్తి మృతి


