హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పార్వతీపురం పురపాలికలో ఖాళీల గోల

 PPM: జిల్లా కేంద్రమైన పార్వతీపురం మున్సిపాలిటీలో కీలక అధికారుల పోస్టులు నెలల తరబడి ఖాళీగా ఉన్నాయి. ఇంజినీరింగ్ విభాగంలో డీఈ, ఏఈ సెలవులో ఉండగా, రెవెన్యూకు ఐదు నెలలుగా అధికారి లేరు. టౌన్ ప్లానింగ్ అధికారి సస్పెండయ్యారు. ఏడాదిన్నరలో ఐదుగురు కమిషనర్లు మారారు. 36 వార్డుల్లో వారానికోసారే నీరు అందుతోంది. కొత్త పాలకవర్గం ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.