హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సింహాద్రి అప్పన్నసేవలో ఎమ్మెల్యే దంపతులు

విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, పద్మజ దంపతులు మంగళవారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వీరికి ఏఈవో శ్రీను, అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేదాశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు.