హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన పింఛన్ పత్రాల పంపిణీ

GDWL: గద్వాల పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేయూత పథకం కింద నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆర్థిక చేయూత అందించడం సంతోషకరమని, ఈ పథకం లబ్ధిదారులకు ఎంతగానో ఉపయోగపడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.