హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లక్కవరంలో మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య

మార్కాపురం: తాళ్లూరు(M) లక్కవరంలో గంగుల సుభాషిని(36) మంగళవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త వెంకట్రావుతో కలిసి గ్రామ సెంటర్‌లో టిఫిన్ దుకాణం నిర్వహిస్తున్నారు. కుమారుడు విశాఖలో డిగ్రీ, కుమార్తె గుంటూరులో ఇంటర్ చదువుతున్నారు. సుభాషిని ఇంట్లో ఎవరూ లేని సమయాన్నిచూసి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.