NTR: గానుగపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మంగళవారం ఎనిమిది కుర్చీలను అందజేశారు. ప్రవాస భారతీయుడు వి. ఇంద్ర సేనా రెడ్డి రూ. 7 వేలు విలువ చేసే ఈ కుర్చీలను విరాళంగా ఇచ్చారు. పాఠశాల పూర్వ ఆంగ్ల ఉపాధ్యాయుడు యం. రాం ప్రదీప్ విజ్ఞప్తి మేరకు ఈ సహాయం అందింది. ప్రధానోపాధ్యాయులు షేక్ బాబా సాహెబ్, ఉపాధ్యాయ సిబ్బంది దాతకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గానుగపాడు పాఠశాలకు కుర్చీలు అందజేత


