హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొటియా గిరిజనుల నిరసన

PPM: తెలుగు మాట్లాడితే ఉండొద్దని ఒడిశా అధికారులు హెచ్చరిస్తున్నారని కొటియా గ్రూపు గిరిజనులు ఆరోపించారు. సాలూరు మండలం దొర్లతాడివలస, కొటియా గ్రామాల ప్రజలు సోమవారం పార్వతీపురం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఎన్నికల్లో సుమారు 2 వేల మంది పోలీసులతో భయపెట్టారని, పంచాయతీ ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటేసేలా చూడాలని ఇన్‌ఛార్జ్ వైశాలికి వినతిపత్రం ఇచ్చారు. ఎస్పీతో మాట్లాడతామని ఆమె చెప్పారు.